ఐఫోన్లు, యాపిల్ వాచ్‌ల ధరలు మళ్లీ పెరిగాయ్..!


Mon,February 5, 2018 02:03 PM

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్‌లో 2018-19 సంవత్సరానికి గాను దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని 15 నుంచి 20 శాతం పెంచారు. దీంతో యాపిల్ తన ఐఫోన్లు, వాచ్‌ల ధరలను పెంచింది. ఈ మధ్యే 10 శాతం ఉన్న దిగుమతి సుంకం 15 శాతానికి పెరగగా అప్పుడు కూడా ఐఫోన్లు, వాచ్‌ల ధరలు పెరిగాయి. ఇక తాజాగా మళ్లీ ఈ సుంకం పెరగడంతో యాపిల్ సంస్థ తన ఫోన్లు, వాచ్‌ల ధరలను మళ్లీ పెంచింది. దీంతో పెరిగిన ధరల ప్రకారం ఇప్పుడు ఐఫోన్లు, వాచ్‌లు వినియోగదారులకు లభిస్తున్నాయి.

అయితే ఐఫోన్ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను మాత్రం భారత్‌లోనే తయారు చేస్తుండడంతో దీని ధర పెరగలేదు. కానీ మిగిలిన ఐఫోన్ మోడల్స్ ధరలు మాత్రం 3.5 శాతం వరకు పెరిగాయి. ఈ పెంపుతో ఐఫోన్ X 256 జీబీ వేరియెంట్ ఇప్పుడు రూ.1,08,930 ధర పలుకుతున్నది. గతంలో దీని ధర రూ.1,05,720 ఉండేది. ఆరంభంలో ఈ ఫోన్ ధర రూ.1.02 లక్షలుగా ఉన్నది.

ఐఫోన్లు, యాపిల్ వాచ్‌ల పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..
iphone-hiked-prices
iphone-hiked-prices

2018

More News

VIRAL NEWS