యాపిల్ ఉత్పత్తులపై సిటీ బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్


Sat,June 9, 2018 08:50 PM

సిటీ బ్యాంక్‌తో భాగస్వామ్యం అయిన యాపిల్ ఇండియా వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నది. తన ఐప్యాడ్, యాపిల్ వాచ్, యాపిల్ పెన్సిల్, మాక్‌బుక్‌లను కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్నవారు ఈ యాపిల్ ఉత్పత్తులు కొంటే వారికి నిర్దిష్ట మొత్తంలో క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్రమంలో మాక్‌బుక్‌పై వినియోగదారులకు రూ.10వేలు క్యాష్‌బ్యాక్ లభిస్తుండగా, ఐప్యాడ్ పై రూ.5వేలు, యాపిల్ వాచ్‌పై రూ.5వేలు, యాపిల్ పెన్సిల్‌పై రూ.1వేయి క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో తగ్గింపు ధరలకే ఆయా ఉత్పత్తులను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. సిటీ బ్యాంక్ కార్పొరేట్ కార్డు హోల్డర్లకు ఈ ఆఫర్ వర్తించదు. ఈ నెల 11 నుంచి జూలై 31వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది.

2956

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles