గేమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ స‌ర్వీస్‌ను లాంచ్ చేసిన యాపిల్


Tue,March 26, 2019 12:35 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్.. యాపిల్ ఆర్కేడ్ పేరిట నూత‌నంగా ఓ గేమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ స‌ర్వీస్‌ను నిన్న లాంచ్ చేసింది. నిన్న జ‌రిగిన స్పెష‌ల్ ఈవెంట్‌లో యాపిల్ ఈ స‌ర్వీస్‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే ప‌లు గేమ్ డెవ‌ల‌పింగ్ సంస్థ‌ల‌తో యాపిల్ భాగ‌స్వామ్యం అయి 100కు పైగా గేమ్‌ల‌కు గాను ఈ గేమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ స‌ర్వీస్‌ను అందిస్తున్న‌ది. ఈ స‌ర్వీస్‌లో భాగంగా ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌, యాపిల్ టీవీ యూజ‌ర్లు త‌మ కుటుంబంలోని 6 మంది స‌భ్యుల‌తో గేమ్స్ ఆడ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఆ గేమ్స్ లో యాడ్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఎలాంటి లిమిట్ లేకుండా గేమ్స్ ఆడ‌వ‌చ్చు.

అన్న‌పూర్ణ ఇంట‌రాక్టివ్‌, బొస్సా స్టూడియోస్‌, కార్టూన్ నెట్‌వ‌ర్క్‌, ఫింజి, జియాంట్ స్క్విడ్‌, క్లెయ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కొనామి, లెగో, మిస్ట్‌వాక‌ర్ కార్పొరేష‌న్‌, సెగా, స్నోమ్యాన్‌, ఉస్టో గేమ్స్ త‌దిత‌ర గేమ్ డెవ‌ల‌పింగ్ కంపెనీల‌కు చెందిన గేమ్స్‌కు గాను యాపిల్ త‌న గేమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ స‌ర్వీస్‌ను అందిస్తున్న‌ది. త్వ‌ర‌లో యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానున్న ఈ గేమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ సేవ‌లు ఒకేసారి 150 దేశాల్లోని యాపిల్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ సేవ‌ల‌కు గాను అయ్యే నెల‌వారీ లేదా వార్షిక చార్జిల వివ‌రాల‌ను మాత్రం యాపిల్ ఇంకా వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు తెలుస్తాయి.

1012

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles