2019 ఏడాదికి బెస్ట్ యాప్స్, గేమ్స్‌ను ప్రకటించిన ఆపిల్


Tue,December 3, 2019 03:55 PM

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ 2019 సంవత్సరానికి గాను యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న అన్ని యాప్స్, గేమ్స్‌లో బెస్ట్ యాప్స్, గేమ్స్ జాబితాను ప్రకటించింది. ఈ క్రమంలో 2019 బెస్ట్ ఐఫోన్ యాప్‌గా Spectre Camera నిలిచింది. అలాగే బెస్ట్ ఐప్యాడ్ యాప్‌గా Flowను ప్రకటించింది. ఇక Affinity Publisher ను బెస్ట్ మాక్ యాప్‌గా, The Explorers ను బెస్ట్ ఆపిల్ టీవీ యాప్‌గా, Sky: Children of the Light ను బెస్ట్ ఐఫోన్ గేమ్‌గా ఆపిల్ ప్రకటించింది. అలాగే టాప్ ఫ్రీ గేమ్‌లలో మారియో కార్ట్ టూర్ మొదటి స్థానంలో నిలవగా, టాప్ పెయిడ్ గేమ్స్‌లో మైన్‌క్రాఫ్ట్ నిలిచింది. అదేవిధంగా Hyper Light Drifterను ఐప్యాడ్ గేమ్ ఆఫ్ ది ఇయర్‌గా, GRIS ను మాక్ గేమ్ ఆఫ్ ది ఇయర్‌గా, Wonder Boy: The Dragons Trapను ఆపిల్ టీవీ గేమ్ ఆఫ్ ది ఇయర్‌గా, Sayonara Wild Hearts ను ఆపిల్ ఆర్కేడ్ గేమ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించారు.

887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles