రూ.899 కే ఆంబ్రేన్ స్మార్ట్‌వాచ్


Tue,September 12, 2017 09:56 AM

ఆంబ్రేన్ త‌న నూత‌న స్మార్ట్‌వాచ్ ఏఎస్‌డ‌బ్ల్యూ-11 ను విడుద‌ల చేసింది. రూ.899 ధ‌ర‌కే ఈ స్మార్ట్‌వాచ్ ల‌భిస్తున్న‌ది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ వాచ్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందులో ప‌లు యాక్టివిటీ ట్రాక‌ర్లు ఉన్నాయి. స్టెప్ కౌంట‌ర్‌, క్యాల‌రీ కౌంటర్‌, స్లీప్ మానిట‌ర్ ట్రాక‌ర్లు ఉన్నాయి. వీటితో రోజువారీ న‌డిచిన స్టెప్స్‌, బ‌ర్న్ అయిన క్యాల‌రీలు, నిద్ర పోయిన స‌మ‌యం వంటి యాక్టివిటీల‌ను ట్రాక్ చేసుకోవ‌చ్చు. 1.44 ఇంచ్ ట‌చ్ స్క్రీన్ డిస్‌ప్లే ఇందులో ఉంది. బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఫోన్ ల‌కు ఈ వాచ్ ను పెయిర్ చేసుకోవ‌చ్చు. దీంతో వాచ్ ద్వారానే కాల్స్ ఆన్స‌ర్ చేయ‌వ‌చ్చు. అదేవిధంగా ఈ వాచ్‌లో అలారం, కాల్/మెసేజ్ రిమైండ‌ర్లు, స్టాప్‌వాచ్‌, క్యాలెండ‌ర్‌, బిల్టిన్ మైక్రోఫోన్‌, స్పీక‌ర్లు, యాంటీ లాస్ట్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇందులో 200 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ ఉంది. ఒక‌సారి ఫుల్ చార్జి చేస్తే 2 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది.

3004

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles