30 గంటల ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనున్న అమెజాన్


Wed,June 20, 2018 03:54 PM

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ 30 గంటల ప్రైమ్ డే సేల్‌ను త్వరలో నిర్వహించనుంది. జూలై 7 నుంచి జూలై 15వ తేదీల మధ్య ఈ సేల్ కొనసాగనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్లను ఇవ్వనుంది. అనేక ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్లను ఇవ్వడంతోపాటు ఆకట్టుకునే ఆఫర్లను కూడా అందించేందుకు అమెజాన్ సిద్ధమవుతున్నది.

అమెరికాకు చెందిన అతి పెద్ద రిటెయిల్ సంస్థ వాల్‌మార్ట్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే అమెజాన్ తన కస్టమర్లు చేజారిపోకుండా ఉండేందుకు గాను భారీ ఎత్తున ఆఫర్లను అందించేలా ఈ ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించనుంది. కేవలం 30 గంటల పాటు మాత్రమే ఈ సేల్ జరగనున్నప్పటికీ అందులో అధిక శాతం వరకు భారీ డిస్కౌంట్లను అందించేందుకు అమెజాన్ ప్లాన్ చేసింది. అయితే సేల్ జరిగే కచ్చితమైన తేదీని అమెజాన్ వెల్లడించకపోయిప్పటికీ వచ్చే నెల రెండో వారంలో ఆ సేల్ ఉంటుందని తెలిసింది.

1976

More News

VIRAL NEWS