కొబ్బరి చిప్పకు రూ.1300.. అమెజాన్‌తో ఆడుకున్న నెటిజన్లు!


Wed,January 16, 2019 03:37 PM

మీరు కొబ్బరి కాయ కొట్టి ఖాళీ కొబ్బరి చిప్పను పడేస్తున్నారా? అయితే మీరు చాలా నష్టపోతున్నట్లే. ఎందుకంటే అదే కొబ్బరి చిప్పను అమెజాన్ రూ.1300కు అమ్ముతున్నది. ఈ మధ్య అమెజాన్‌లో నేచురల్ కొకొనట్ షెల్ కప్స్ అన్న ప్రోడక్ట్, దాని కింద ఉన్న రేటు చూసి యూజర్లకు కళ్లు తిరిగినంత పనైంది. ఈ ప్రోడక్ట్ కిందే ఇది నిజమైన, సహజమైన కొబ్బరి కాబట్టి.. కాస్త పగుళ్లు అవీ ఉండొచ్చంటూ దానికి వివరణ కూడా ఇచ్చారు. ఇది చూసి చాలా మంది ఇండియన్స్ షాక్ తిన్నారు. రూ.20 పెడితే ఓ కొబ్బరి కాయ వస్తుంది.. వాటిని కొట్టి షెల్స్ పడేస్తాము.. అలాంటివాటికి నువ్వింత రేటు పెడతావా అంటూ అమెజాన్‌పై విరుచుకుపడుతున్నారు. ఎందుకూ పనికి రాని దానికి ఇంత రేటు పెట్టడమేంటని ఒకరు, వీటిని కొంటున్న వారిపై జాలి చూపడం తప్ప ఏమీ చేయలేమని మరొకరు కామెంట్ చేశారు. కొందరు పాజిటివ్‌గా స్పందించిన వాళ్లూ ఉన్నారు. నిజానికి షోరూమ్ ధర రూ.3 వేలు.. కానీ మా ఫ్రెండ్ అమెజాన్‌లో రూ.1300కే కొన్నాడు తెలుసా అంటూ ఓ యూజర్ కామెంట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది.
6883

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles