రోబోట్లతో వస్తువులను డెలివరీ చేస్తున్న అమెజాన్..!


Mon,August 12, 2019 04:46 PM

వాషింగ్టన్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ రోబోట్ల ద్వారా అమెరికాలో ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేయడం ప్రారంభించింది. వాషింగ్టన్‌లో ఉన్న స్నోహోమిష్ కౌంటీలో ప్రస్తుతం 6 రోబోట్లు అమెజాన్ ప్యాకేజీలను డెలివరీ చేస్తున్నాయి. ఈ రోబోట్లు 6 చక్రాలను కలిగి ఉండగా వాటిపై బ్లూ కలర్ పెయింట్‌ను వేశారు. దానిపై ప్రైమ్ అని రాశారు. ఇక వీటిని అడోరా బాట్స్ అని అమెజాన్ వ్యవహరిస్తోంది.

కాగా అడోరా బాట్స్ ప్రస్తుతం కస్టమర్లకు అమెజాన్ నుంచి ప్యాకేజీలను డెలివరీ చేస్తున్నప్పటికీ వాటికి తోడుగా అమెజాన్ స్కౌట్ అంబాసిడర్లు వెంట వెళ్తున్నారు. వీరు ఆ రోబోట్లను పర్యవేక్షించడంతోపాటు వాటి పనితీరుపై కస్టమర్లకు వచ్చే సందేహాలను తీరుస్తూ వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. ఇక ఈ రోబోట్లతో కేవలం పగటి పూట మాత్రమే కాకుండా, రాత్రి పూట, భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ప్యాకేజీలను డెలివరీ చేయిస్తున్నారు. వాటి పనితీరును అమెజాన్ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెజాన్ త్వరలోనే పెద్ద ఎత్తున రోబోట్ల ద్వారా కస్టమర్లకు ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేయాలని చూస్తోంది. కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఈ రోబోట్లను ల్యాబ్‌లలో పరీక్షించిన అమెజాన్ స్కౌట్స్ ఇప్పుడు వాటిని వీధుల్లో నడిపిస్తూ వాటితో ప్యాకేజీలను డెలివరీ చేయిస్తున్నారు. మరి ఈ రోబోట్లను అమెజాన్ పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తుందో చూడాలి..!

2620
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles