అమెజాన్ సైట్ నుంచి మాయమైన వేలాది వస్తువులు


Fri,February 1, 2019 10:53 AM

ముంబై: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నుంచి శుక్రవారం వేలాది వస్తువులు మాయమయ్యాయి. ఎకో స్పీకర్లు, బ్యాటరీలు, ఫ్లోర్ క్లీనర్స్‌లాంటి వస్తువులు అందులో ఉన్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఈ-కామర్స్ నిబంధనలు అమల్లోకి రావడంతో అమెజాన్ ఈ వస్తువులను తొలగించక తప్పలేదు. గురువారం అర్ధరాత్రి నుంచే అమెజాన్ ఇండియా తన సైట్ నుంచి ఈ వస్తువులను తొలగించడం ప్రారంభించింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం తప్ప మరో అవకాశం అమెజాన్‌కు లేదని సంస్థ వర్గాలు వెల్లడించాయి. గత డిసెంబర్‌లో ఈ-కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. తమ ఉత్పత్తులు లేదా తమకు వాటా ప్రయోజనం లభించే సంస్థల ఉత్పత్తులను ఇతర వెండర్స్ ద్వారా ఈ-కామర్స్ సైట్లలో అమ్మకూడదన్నది కొత్త నిబంధన.

ఇది అమెజాన్‌తోపాటు గతేడాది ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ సంస్థకూ వర్తిస్తుంది. దీంతో ఈ రెండు ఈ-కామర్స్ సంస్థల నుంచి ఇలాంటి వేలాది వస్తువులను తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. ఉదాహరణకు క్లౌడ్‌టేల్ అనే వెండర్ అమెజాన్‌లో ఎన్నో వస్తువులు అమ్మేది. అయితే ఇందులో అమెజాన్‌కు పరోక్ష వాటా ఉంది. దీంతో సదరు వెండర్‌కు చెందిన వస్తువులు ఏవీ ఇప్పుడు అమెజాన్‌లో అందుబాటులో లేవు. ఇక భారత్‌కు చెందిన బట్టల దుకాణం షాపర్స్ స్టాప్‌లోనూ అమెజాన్‌కు ఐదు శాతం వాటా ఉండటంతో ఆ సంస్థకు చెందిన దుస్తులు కూడా ఇప్పుడు అమెజాన్ నుంచి తొలగించారు. వివిధ ఎకో స్పీకర్లు, బ్యాటరీ సంస్థల్లోనూ అమెజాన్‌కు వాటా ఉండటంతో వాటిని కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి వాల్‌మార్ట్, అమెజాన్ ఈ కొత్త నిబంధనల అమలును వాయిదా వేయాలని తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది.

3553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles