అమెజాన్‌లో డెబిట్ కార్డుల‌తోనూ ఈఎంఐ స‌దుపాయం..!


Mon,September 17, 2018 01:25 PM

మీకు క్రెడిట్ కార్డు లేదా..? ఈఎంఐలో ఏదైనా వస్తువును కొనాలని చూస్తున్నారా..? అయితే ఏం ఫరవాలేదు. మీకున్న డెబిట్ కార్డుతోనే ఈఎంఐలో మీకు కావల్సిన వస్తువును కొనుగోలు చేయవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నది అమెజాన్. అమెజాన్‌లో ఇప్పుడు అమెజాన్ పే ఈఎంఐ పేరిట ఓ కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

భారత్‌లో అమెజాన్ యాప్‌ను వాడుతున్న మొబైల్ యాజర్లు యాప్‌లోకి వెళ్లి అమెజాన్ పే ఈఎంఐలో రిజిస్టర్ చేసుకోవాలి. అందుకు గాను వారు తమ తమ ఆధార్, పాన్ వివరాలను ఇవ్వాలి. దీంతో అమెజాన్ పే ఈఎంఐ క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయిస్తారు. అనంతరం నిర్దేశించిన మొత్తంలో క్రెడిట్ లిమిట్‌తో అమెజాన్ పే ఈఎంఐ యాక్టివేట్ అవుతుంది. తరువాత యూజర్లు ఆ అకౌంట్‌కు తమ డెబిట్ కార్డును లింక్ చేయాలి. దీంతో ప్రాసెస్ పూర్తవుతుంది. తరువాత యూజర్లు అమెజాన్ పే ఈఎంఐ ఉపయోగించి అమెజాన్‌లో వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ పే ఈఎంఐ విధానంలో వస్తువులను కొనాలంటే యూజర్లు కనీసం రూ.8వేలు ఆపైన విలువైన ఒకే వస్తువును ఎంచుకోవాలి. అనంతరం చెక్ అవుట్ చేసే సమయంలో అమెజాన్ పే ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక ఆభరణాలు, గిఫ్ట్ కార్డులు, అమెజాన్ పే బ్యాలెన్స్‌కు అమెజాన్ పే ఈఎంఐ పనిచేయదు. కాగా ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లకు చెందిన ఖాతాదారులకు మాత్రమే అమెజాన్ పే ఈఎంఐ లభిస్తున్నది. కేవ‌లం అమెజాన్ మొబైల్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. ఇక త్వరలో ఫ్లిప్‌కార్ట్ కూడా ఇదే తరహాలో ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్, ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్ ఈఎంఐ పేరిట నూతన సదుపాయాలను ప్రవేశపెట్టనుందని తెలిసింది.

2770

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles