అమెజాన్ సంస్థ ఎకో డాట్ (3వ జనరేషన్), ఎకో ప్లస్ (2వ జనరేషన్), ఎకో సబ్ పేరిట మూడు నూతన ఎకో డివైస్లను భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. ఎకో డాట్ రూ.4,499 ధరకు లభిస్తుండగా, ఎకో ప్లస్ రూ.14,999 ధరకు, ఎకో సబ్ రూ.12,999 ధరకు వినియోగదారులకు లభిస్తున్నాయి. వీటికి గాను అమెజాన్లో ప్రీ ఆర్డర్లను ఇప్పటికే ప్రారంభించగా, అక్టోబర్ 11 నుంచి ఈ డివైస్లు అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ 14వ తేదీ నుంచి ఎకో సబ్ లభిస్తుంది. ఈ డివైస్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.