అమెజాన్‌లో యాపిల్ ఫెస్ట్.. తగ్గింపు ధరలకు ఐఫోన్లు, వాచ్‌లు, మాక్‌బుక్‌లు..!


Wed,March 7, 2018 05:03 PM

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన వెబ్‌సైట్‌లో యాపిల్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా కొనసాగుతున్న ప్రత్యేక సేల్‌లో పలు యాపిల్ ఉత్పత్తులపై వినియోదారులకు రాయితీలు, ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో ఐఫోన్లను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. అలాగే ఐప్యాడ్లు, యాపిల్ వాచ్‌లు, మాక్‌బుక్‌లపై ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్లను అందిస్తున్నారు.

యాపిల్ ఫెస్ట్‌లో ఐఫోన్ ఎస్‌ఈ రూ.17,999 ధరకు లభిస్తున్నది. అలాగే ఐఫోన్ 6 రూ.23,999కు, ఐఫోన్ 6ఎస్ రూ.33,999కు, ఐఫోన్ 6ఎస్ ప్లస్ రూ.38,999కు, ఐఫోన్ 7 రూ.41,999కు, ఐఫోన్ 8 రూ.54,999కు, ఐఫోన్ 10 రూ.82,999 ధరలకు లభిస్తున్నాయి. వీటితోపాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో ఏదైనా యాపిల్ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసి ఈఎంఐ పెట్టుకుంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు.

3252

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles