అమెజాన్‌లో ఈ నెల 20 నుంచి గ్రేట్ ఇండియ‌న్ సేల్


Sat,January 12, 2019 05:16 PM

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ వెబ్ సైట్‌లో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో ఎల‌క్ట్రానిక్స్‌పై 60 శాతం వ‌ర‌కు త‌గ్గింపును అందివ్వ‌నున్నారు. అలాగే ప‌లు ఉత్పత్తుల‌పై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ స‌దుపాయాల‌ను కూడా ఇవ్వ‌నున్నారు. సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే అద‌నంగా మ‌రో 10 శాతం రాయితీ కూడా ఇవ్వ‌నున్నారు. అలాగే వ‌న్‌ప్ల‌స్ 6టి, హాన‌ర్ 8ఎక్స్‌, ఐఫోన్ X, రెడ్‌మీ వై2, హువావే నోవా 3ఐ, వివో వై9 ప్రొ ఫోన్ల‌పై డిస్కౌంట్ల‌ను అందివ్వ‌నున్నారు. ఈ సేల్‌లో హార్డ్ డిస్కులు, హెడ్‌ఫోన్లు, గేమింగ్ యాక్స‌స‌రీలపై 60 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను ఇస్తారు. అలాగే ల్యాప్‌టాప్‌ల‌పై రూ.35వేల భారీ డిస్కౌంట్‌, కెమెరాల‌పై రూ.5వేల డిస్కౌంట్, యాక్టివిటీ ట్రాక‌ర్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, లార్జ్ స్క్రీన్ ఎల్ఈడీ టీవీలపై 50 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందివ్వ‌నున్నారు. వీటితోపాటు ప్రింట‌ర్లు, స్పీక‌ర్లు, ట్యాబ్లెట్ పీసీలపై 40 శాతం, సౌండ్ బార్స్‌పై 30 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను ఇవ్వ‌నున్నారు.

3304

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles