అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్ షురూ..!


Sun,January 20, 2019 02:57 PM

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ వెబ్‌సైట్ లో గ్రేట్ ఇండియ‌న్ సేల్ షురూ అయింది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్‌, టీవీలు, స్పీకర్ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా ఐఫోన్ X 64జీబీ రూ.74,999 ధ‌ర‌కే ల‌భిస్తున్న‌ది. అలాగే హువావే పీ20 ప్రొ రూ.59,999 ధ‌ర‌కు, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్ రూ.52,990కు, ఎస్‌9 64 జీబీ రూ.48,990కి, నోట్ 8 రూ.39,990 కి, ఒప్పో ఆర్‌17 రూ.31,990 ధ‌ర‌కు, హాన‌ర్ ప్లే 4జీబీ, 64 జీబీ రూ.13,999కు, హువావే నోవా 3ఐ రూ.16,990కి, వివో వి9 ప్రొ - రూ.15,990కి, రియ‌ల్ మి యు1 4జీబీ రూ.13,499 ధ‌ర‌కు, హువావే పి20 లైట్ రూ.12,999 ధ‌ర‌కు, హాన‌ర్ 8సి రూ.10,999కి, రియ‌ల్ మి యు1 3జీబీ రూ.10,999కి ల‌భిస్తున్నాయి. అలాగే శాంసంగ్ గేర్ ఎస్‌3 ఫ్రాంటియ‌ర్ రూ.17,990 ధ‌ర‌కు, కిండిల్ పేప‌ర్‌వైట్ రూ.10,499 ధ‌ర‌కు, ఎకో ప్ల‌స్ (సెకండ్ జెన్‌) రూ.11,999 ధ‌ర‌కు, అమెజాన్ ఎకో రూ.7,999కు, ఎకో డాట్ (థ‌ర్డ్ జెన్‌) రూ.2,999 ధ‌ర‌కు, ఫైర్ టీవీ స్టిక్ రూ.2,999 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌లో 2టీబీ హార్డ్ డిస్క్‌లు రూ.4699 ప్రారంభ ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, 32 ఇంచుల టీవీలు, స్మార్ట్ టీవీలు, లార్జ్ స్క్రీన్ టీవీలు, ప్రీమియం ఓలెడ్, క్యూలెడ్ టీవీలపై 50 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ల్యాప్‌టాప్‌ల‌పై రూ.40వేల వ‌ర‌కు, కెమెరాలు, యాక్స‌స‌రీలు, హెడ్‌ఫోన్స్‌పై 60 శాతం వ‌ర‌కు, స్పీక‌ర్ల‌పై 50 శాతం వ‌ర‌కు, గేమింగ్ క‌న్సోల్స్‌, యాక్స‌స‌రీల‌పై 40 శాతం వ‌ర‌కు రాయితీల‌ను ఇస్తున్నారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగ‌నుంది.

4330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles