ఫైర్ హెచ్‌డీ 8 (2018) ట్యాబ్లెట్ పీసీని విడుదల చేసిన అమెజాన్


Sat,September 8, 2018 02:45 PM

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ఫైర్ సిరీస్‌లో నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీని తాజాగా విడుదల చేసింది. ఫైర్ హెచ్‌డీ 8 (2018) పేరిట ఈ ట్యాబ్లెట్ పీసీని విడుదల చేసింది. 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ట్యాబ్లెట్ పీసీ వచ్చే నెల 4వ తేదీ నుంచి లభ్యం కానుంది. అమెరికా మార్కెట్‌లో ఈ ట్యాబ్లెట్ పీసీ ప్రారంభ ధర 79 డాలర్లుగా నిర్ణయించారు.

అమెజాన్ ఫైర్ హెచ్‌డీ 8 (2018) ఫీచర్లు...


8 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆధారిత ఫైర్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డాల్బీ ఆడియో, 10 గంటల బ్యాటరీ లైఫ్.

2861

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles