విండోస్ 10 పీసీల్లో ఇకపై అమెజాన్ అలెక్సాకు సపోర్ట్..!


Thu,July 18, 2019 02:28 PM

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 పీసీ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై విండోస్ 10 ఓఎస్ ఉన్న పీసీల్లో అమెజాన్ అలెక్సాకు సపోర్ట్ లభించనుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ డిజిటల్ అసిస్టెంట్ కార్టానా విండోస్ 10 పీసీల్లో అందుబాటులో ఉండగా.. దానికి అమెజాన్ అలెక్సా అదనం కానుంది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను విండోస్ 10 ఇన్‌సైడర్ ప్రివ్యూ బిల్డ్ ఓఎస్‌లో అందిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో విండోస్ 10 యూజర్లందరికీ అమెజాన్ అలెక్సా లభ్యం కానుంది. దీంతో అమెజాన్ ఎకో డివైస్‌లను ఉపయోగించినట్లుగానే యూజర్లు విండోస్ 10 పీసీలను ఉపయోగించుకోవచ్చు..!

710
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles