అమేజ్‌ఫిట్ వెర్జ్ స్మార్ట్‌వాచ్ విడుద‌ల‌


Thu,January 17, 2019 03:35 PM

షియోమీకి చెందిన స‌బ్‌బ్రాండ్ హువామీ.. అమేజ్‌ఫిట్ వెర్జ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌వాచ్‌ను భార‌త మార్కెట్లో ఇటీవ‌లే విడుద‌ల చేసింది. ఇందులో ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. అలాగే హార్ట్ రేట్ సెన్సార్, 1.3 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 11 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌, 1.2 గిగాహెడ్జ్ డ్యుయ‌ల్ కోర్ ప్రాసెస‌ర్‌, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ స్టోరేజ్‌, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, ఆండ్రాయిడ్ 4.4 ఆపైన‌, ఐఓఎస్ 9.0 ఆపైన వెర్ష‌న్ ఉన్న డివైస్‌ల‌కు క‌నెక్టివిటీ, ఎయిర్ ప్రెష‌ర్ సెన్సార్‌, వియ‌రింగ్ డిటెక్ష‌న్ సెన్సార్‌, 390 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 5 రోజుల బ్యాట‌రీ లైఫ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ వాచ్‌లో అందిస్తున్నారు. స్కై గ్రే, ట్విలైట్ బ్లూ, మూన్‌లైట్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉన్న ఈ వాచ్ రూ.11,999 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ప్ర‌త్యేకంగా అమెజాన్ సైట్‌లో ల‌భిస్తున్న‌ది.

1739

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles