నూతన స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌బ్యాండ్‌లను విడుదల చేసిన షియోమీ


Mon,September 17, 2018 05:09 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన సబ్ బ్రాండ్ హువామీ కింద నూతన స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌బ్యాండ్‌లను ఇవాళ విడుదల చేసింది. అమేజ్‌ఫిట్ వెర్జ్ పేరిట స్మార్ట్‌వాచ్‌ను, అమేజ్‌ఫిట్ హెల్త్ బ్యాండ్ 1ఎస్ పేరిట స్మార్ట్‌బ్యాండ్‌లను షియోమీ విడుదల చేసింది. అమేజ్‌ఫిట్ వెర్జ్ స్మార్ట్‌వాచ్‌లో 1.3 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.2 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ స్టోరేజ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, ఆండ్రాయిడ్ 4.4 ఆపైన వెర్షన్, ఐఓఎస్ 9.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లకు కంపాటబిలిటీ, ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్, ఎయిర్ ప్రెషర్ సెన్సార్, వియరింగ్ డిటెక్షన్ సెన్సార్, 390 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ ధర రూ.8,430గా ఉంది.

అమేజ్‌ఫిట్ హెల్త్ బ్యాండ్ 1ఎస్‌లో 1.42 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్ కంపాటబిలిటీ, ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్, ఈసీజీ సెన్సార్, 95 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌బ్యాండ్ ధర రూ.7,370 గా ఉంది.

2080

More News

VIRAL NEWS

Featured Articles