నూతన స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌బ్యాండ్‌లను విడుదల చేసిన హువావే


Mon,September 10, 2018 04:44 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌వాచ్ అమేజ్‌ఫిట్ పేస్‌ను, స్మార్ట్‌బ్యాండ్ అమేజ్‌ఫిట్ కోర్ ఫిట్‌నెస్ బ్యాండ్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.3,999 ధరకు అమేజ్‌ఫిట్ కోర్ ఫిట్‌నెస్ బ్యాండ్ లభిస్తుండగా, రూ.9,999 ధరకు అమేజ్‌ఫిట్ పేస్ స్మార్ట్‌వాచ్ లభిస్తున్నది. ఈ రెండు డివైస్‌లను అమెజాన్ సైట్‌లో వినియోగదారులు ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు.

అమేజ్‌ఫిట్ కోర్ ఫిట్‌నెస్ బ్యాండ్‌లో 1.23 ఇంచ్ కలర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఈ-మెయిల్స్, కాల్స్, మెసేజెస్, యాప్ నోటిఫికేషన్స్, హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ ట్రాకర్, 170 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. అలాగే అమేజ్‌ఫిట్ పేస్ స్మార్ట్‌వాచ్‌లో 1.34 ఇంచ్ ఆల్వేస్ ఆన్ ఎల్‌సీడీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, 320 x 300 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, కాల్స్, మెసేజెస్, ఈ-మెయిల్స్, యాప్స్ నోటిఫికేషన్లు, 12 రకాల స్పోర్ట్స్ మోడ్స్, జీపీఎస్, హార్ట్ రేట్ సెన్సార్, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 290 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

1687

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles