రూ.9,999కే అల్కాటెల్ 3టి 10 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్


Tue,September 10, 2019 04:48 PM

మొబైల్స్ తయారీదారు అల్కాటెల్.. 3టి 10 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.9,999 ధరకు ఈ ట్యాబ్లెట్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది. కాగా ఈ ట్యాబ్‌తోపాటు ఎక్స్‌టర్నల్ డాక్ స్పీకర్లు, 2000 ఎంఏహెచ్ బ్యాటరీని అదనంగా కొనుగోలు చేస్తే రూ.14,999 అవుతుంది.

అల్కాటెల్ 3టి 10 ట్యాబ్లెట్‌లో.. 10 ఇంచుల డిస్‌ప్లే, 1.28 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, సింగిల్ సిమ్, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4080 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

1057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles