అల్కాటెల్ 3సీ స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,January 18, 2018 01:14 PM

టీసీఎల్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'అల్కాటెల్ 3సీ' ని తాజాగా విడుదల చేసింది. ఇందులో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 18:9 యాస్పెక్ట్ రేషియోను ఈ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇందులో మెమొరీ కార్డు కోసం ప్రత్యేక స్లాట్ ఇచ్చారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. రూ.10,155 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

అల్కాటెల్ 3సీ ఫీచర్లు...


6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3జీ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1737

More News

VIRAL NEWS