రెండు నూత‌న బ‌డ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేసిన అల్కాటెల్


Wed,January 9, 2019 05:57 PM

మొబైల్స్ త‌యారీదారు అల్కాటెల్.. 1ఎక్స్ (2019), 1సి (2019) పేరిట రెండు నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల‌ను తాజాగా విడుద‌ల చేసింది. లాస్ వెగాస్‌లో జ‌రుగుతున్న క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్‌) 2019లో అల్కాటెల్ వీటిని ప్ర‌ద‌ర్శించింది. ఈ రెండు ఫోన్ల‌లోనూ ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అందిస్తున్నారు. అల్కాటెల్ 1ఎక్స్ (2019) రూ.9,654 ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, అల్కాటెల్ 1సి (2019) రూ.5,635 ధ‌ర‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానుంది. వీటిల్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

అల్కాటెల్ 1ఎక్స్ (2019) ఫీచ‌ర్లు...


5.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

అల్కాటెల్ 1సి (2019) ఫీచ‌ర్లు...


5.3 ఇంచ్ డిస్‌ప్లే, 960 x 480 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్‌, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

2658

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles