ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. రూ.995కు 6 నెలల పాటు అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్..!


Sat,March 3, 2018 04:07 PM

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.995కి ఓ కొత్త ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 6జీబీ డేటా వస్తుంది. దీన్ని నెలకు 1జీబీ చొప్పున వాడుకోవచ్చు. ఇక 6 నెలల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. కాగా జియోలో ఇదే ప్లాన్ రూ.999కు లభిస్తుండగా దాంట్లో వినియోగదారులకు 60 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

2504

More News

VIRAL NEWS

Featured Articles