ఎయిర్‌టెల్ ఇండిపెండెన్స్ డే ఆఫర్.. రీచార్జిలపై క్యాష్‌బ్యాక్..!


Sun,August 12, 2018 04:38 PM

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నది. ఎయిర్‌టెల్‌కు చెందిన పేమెంట్స్ బ్యాంక్‌లో రీచార్జి చేసుకుంటే రూ.250 వరకు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకునే అవకాశం కల్పించింది. ప్రతి గంటకు 300 మంది వినియోగదారులు ఇలా క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలియజేసింది. అలాగే రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ యాప్‌లో రీచార్జి చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. రూ.399 ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.4 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ఆఫర్లు కస్టమర్లకు ఈ నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌టెల్ ఇండియా తెలిపింది.

3954

More News

VIRAL NEWS