30 జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్.. ఎలాగో తెలుసా..?


Mon,March 26, 2018 01:45 PM

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన 4జీ వీవోఎల్‌టీఈ సేవలను ముంబై, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చెన్నై, వెస్ట్‌బెంగాల్ సర్కిల్స్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా వెస్ట్‌బెంగాల్, ఒరిస్సా, అస్సాం, కేరళ, బీహార్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్‌లో ప్రస్తుతం 4జీ వీవోఎల్‌టీఈ బీటా ప్రోగ్రామ్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది. దీని కింద తన కస్టమర్లకు 30 జీబీ మొబైల్ డేటాను ఉచితంగా అందిస్తున్నది. అయితే ఇందుకు ఆయా సర్కిల్స్‌లో ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లు సదరు బీటా ప్రోగ్రామ్‌లో చేరాల్సి ఉంటుంది. దీంతో వారికి 30 జీబీ మొబైల్ డేటా విడతల వారీగా లభిస్తుంది.

4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్‌టెల్ సిమ్ వేసి అందులో ఆ సిమ్‌కు గాను వీవోఎల్‌టీఈని ఆన్ చేయాలి. తరువాత https://www.airtel.in/volte-circle అనే వెబ్‌పేజీకి వెళ్లి అందులో ఎయిర్‌టెల్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఒక వేళ మీ మొబైల్ నంబర్ పైన చెప్పిన బీటా ప్రోగ్రామ్‌కు అర్హత పొందితే ఓటీపీ వస్తుంది. లేదంటే Hi there! Airtel VoLTE is currently unavailable on your number అని మెసేజ్ చూపిస్తుంది. ఒక వేళ అర్హత పొందితే అనంతరం కస్టమర్లకు 4 రోజుల్లోగా 10 జీబీ ఉచిత మొబైల్ డేటా వస్తుంది. దానికి 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఇక వీవోఎల్‌టీఈ బీటా ప్రోగ్రామ్‌లో భాగంగా ఎయిర్‌టెల్‌కు ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ అందించాలి. వీవోఎల్‌టీఈ సర్వీస్ ఎలా ఉందో చెప్పాలి. దీంతో మరో 10 జీబీ మొబైల్ డేటా కస్టమర్‌కు లభిస్తుంది. ఇక ప్రోగ్రామ్ ముగిశాక చివర్లో మరో 10 జీబీ డేటాను ఇస్తారు. దీంతో మొత్తం మూడు విడతల్లో కలిపి ఎయిర్‌టెల్ కస్టమర్లకు 30 జీబీ మొబైల్ డేటా ఉచితంగా వస్తుంది.

4591

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles