ఇన్‌కమింగ్ కాల్‌కూ చార్జీలు.. ఎయిర్‌టెల్‌కు భారీ దెబ్బ!


Thu,December 27, 2018 06:51 PM

న్యూఢిల్లీ: లైఫ్‌టైమ్ ఫ్రీ ఇన్‌కమింగ్ కాల్స్ ఇవ్వడం వల్ల ఎయిర్‌టెల్‌కు భారీ నష్టం వాటిల్లుతున్నది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ భారీగా తగ్గిపోయింది. దీంతో ఆ సంస్థ లైఫ్‌టైమ్ ఫ్రీ ఇన్‌కమింగ్ కాల్స్‌కు గుడ్ బై చెప్పి.. కనీసం రూ.35 రీచార్జీ తప్పనిసరి అని కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీనివల్ల ఆ సంస్థ ఆదాయం పెరగనుంది. అయితే ఈ నిర్ణయం వల్ల మొదట్లో మాత్రం ఎయిర్‌టెల్‌కు పెద్ద దెబ్బ తప్పేలా లేదు. ఇన్‌కమింగ్ కాల్స్‌కూ చార్జీలు అన్న నిబంధన వల్ల 5 కోట్ల నుంచి 7 కోట్ల మంది కస్టమర్లు ఎయిర్‌టెల్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారిపోయే ప్రమాదం ఉన్నదని హిందూ బిజినెస్ లైన్ పత్రిక వెల్లడించింది. అయితే భారీ సంఖ్యలో కస్టమర్లు తరలిపోవడాన్ని సంస్థ సీరియస్‌గా తీసుకోవడం లేదని, భవిష్యత్తులో ఈ నిర్ణయం వల్ల లాభాలు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఆదాయం భారీగా పెరుగుతుందని ఆ వ్యక్తి తెలిపారు. చాలా వరకు ఈ నెట్‌వర్క్‌లో లైఫ్‌టైమ్ ఫ్రీ ఇన్‌కమింగ్ కస్టమర్లే ఉన్నారు. ఇక చాలా మంది ఫీచర్ ఫోన్ల నుంచి 4జీ ఫోన్లకు మారడాన్ని ఓ మంచి ఆదాయ మార్గంగా ఎయిర్‌టెల్ భావిస్తున్నది.

16614

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles