ఎయిర్‌టెల్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో మరింత డేటా..!


Thu,August 9, 2018 03:19 PM

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను వాడుతున్న కస్టమర్లకు అదనపు డేటాను అందిస్తున్నది. ఈ ప్లాన్‌లో ఇప్పటికే నెలవారీ బిల్ సైకిల్‌కు గాను 20 జీబీ ఉచిత మొబైల్ డేటాను డేటా రోల్ ఓవర్ సౌకర్యంతో ఎయిర్‌టెల్ అందిస్తున్నది. కాగా దీనికి అదనంగా మరో 20 జీబీ డేటాను ఎయిర్‌టెల్ ప్రస్తుతం ఇస్తున్నది. దీంతో ఈ ప్లాన్‌లో కస్టమర్లకు మొత్తం 40 జీబీ డేటా లభిస్తుంది. అయితే అదనంగా ఇస్తున్న మొబైల్ డేటాకు ఏడాది పాటు వాలిడిటీ ఇచ్చారు. ఇక ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్స్ యథాతథంగా లభిస్తాయి.

2645

More News

VIRAL NEWS

Featured Articles