ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్.. ఏటీఎంలలో క్యాష్ విత్‌డ్రాయల్ సేవలు..!


Thu,September 6, 2018 03:44 PM

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన కస్టమర్లకు ఏటీఎంలలో నగదు విత్‌డ్రా సేవలను ఇవాళ ప్రారంభించింది. కార్డు లేకుండానే ఏటీఎంలలో నగదు తీసుకునే వీలును కల్పించింది. అందుకు గాను ఏటీఎంలలో ఐఎంటీ (ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్) టెక్నాలజీని వినియోగించుకుంటున్నది. ఐఎంటీ టెక్నాలజీ ఉన్న ఏటీఎంలలో కస్టమర్లు తమ మొబైల్ నంబర్‌తోపాటు సెండర్ కోడ్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరువాత తమకు కావల్సిన మొత్తంలో డబ్బును ఏటీఎం నుంచి తీసుకోవచ్చు.

దేశ వ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో ప్రస్తుతం ఐఎంటీ టెక్నాలజీ ఉన్న ఏటీఎంలు 20వేల వరకు ఉండగా, వాటిల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ప్రస్తుతం నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది చివరి వరకు ఈ టెక్నాలజీ ఉన్న ఏటీఎంలను 1 లక్ష వరకు సిద్ధం చేయనున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులందరూ ప్రస్తుతం ఐఎంటీ సేవలను ఉపయోగించుకోవచ్చని ఎయిర్‌టెల్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అందుకు గాను కస్టమర్లు తన మొబైల్ ఫోన్లలో *400# నంబర్‌ను డయల్ చేయాలి. అనంతరం అందులో క్యాష్ విత్‌డ్రాయల్ రిక్వెస్ట్‌ను జనరేట్ చేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది.

2019

More News

VIRAL NEWS