రూ.7,900 డౌన్‌పేమెంట్‌తో గెలాక్సీ నోట్ 9.. ఎయిర్‌టెల్ ఆఫర్..!


Sun,August 12, 2018 03:09 PM

శాంసంగ్ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9 ను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను భారత్‌లో ఈ నెల 21వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.67,900 ఉండగా, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.84,900 గా ఉంది. అయితే గెలాక్సీ నోట్ 9కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్‌ను ఎయిర్‌టెల్ రూ.7,900 డౌన్ పేమెంట్‌తో వినియోగదారులకు అందిస్తున్నది.

ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.7,900 డౌన్ పేమెంట్ చేస్తే కస్టమర్లకు 24 నెలల ఈఎంఐ తో గెలాక్సీ నోట్ 9 లభిస్తుంది. ఇందుకు గాను కస్టమర్లకు 24 నెలల పాటు నెలకు రూ.2,999 చెల్లించాలి. ఇందులో ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కలిసే ఉంటుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు నెలకు 100 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్‌లో ఉచిత మెంబర్‌షిప్, ఉచిత ఎయిర్‌టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌లు లభిస్తాయి.

గెలాక్సీ నోట్ 9 ఫోన్‌ను కస్టమర్లు ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ముందుగానే తీసుకునేలా ప్రీ ఆర్డర్ చేసే సదుపాయాన్ని కల్పించారు. ఈ క్రమంలో కస్టమర్లు ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేస్తే వారికి ఈ నెల 22వ తేదీ నుంచి ఫోన్లను డెలివరీ చేస్తారు.

3815

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles