ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. కస్టమర్లందరికీ ఉచితంగా అమెజాన్ పే గిఫ్ట్ కార్డులు..!


Thu,August 16, 2018 01:23 PM

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తన కస్టమర్లందరికీ ఉచితంగా అమెజాన్ పే గిఫ్ట్ కార్డులను అందిస్తున్నది. అందుకు గాను కస్టమర్లు ఏం చేయాలంటే.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై మై ఎయిర్‌టెల్ యాప్ ఓపెన్ చేసి అందులో హోమ్ పేజీలో ఉండే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తరువాత వచ్చే ఓటీపీని కన్‌ఫాం చేయాలి. దీంతో 15 డిజిట్లు ఉన్న వోచర్ కోడ్ కస్టమర్‌కు లభిస్తుంది. ఈ కోడ్‌ను అక్టోబర్ 31వ తేదీ లోపు అమెజాన్ పే అకౌంట్‌లో యాడ్ చేసి ఉపయోగించుకోవాలి.

దీంతో కస్టమర్‌కు రూ.51 విలువైన అమెజాన్ పే వాలెట్ బ్యాలెన్స్ లభిస్తుంది. దాన్ని అమెజాన్‌లో వస్తువులు కొనేందుకు లేదా రీచార్జి చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఎయిర్‌టెల్‌లో రూ.100 ఆపైన విలువైన బండిల్డ్ ప్రీపెయిడ్ ప్యాక్‌ను లేదా పోస్ట్‌పెయిడ్ ఇన్ఫినిటీ ప్లాన్‌ను వాడే కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందగలుగుతారు. ఎయిర్‌టెల్ తన 23వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా తన కస్టమర్లందరికీ ఈ బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది.

8411

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles