ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ యూజ‌ర్ల‌కు 30 జీబీ డేటా ఫ్రీ..!


Mon,April 17, 2017 04:58 PM

జియో ఇటీవ‌లే ధ‌న్ ధ‌నా ధ‌న్ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఎయిర్‌టెల్ కూడా త‌న యూజ‌ర్ల‌కు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించేందుకు ముందుకు వ‌స్తోంది. ఆ సంస్థ తాజాగా త‌న పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు 30 జీబీ డేటాను ఉచితంగా ఇస్తోంది. నెల‌కు 10 జీబీ డేటా చొప్పున యూజ‌ర్ల‌కు 3 నెల‌ల‌కు క‌లిపి 30 జీబీ డేటా ల‌భించ‌నుంది.

అయితే ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ ఖాతాదారులు ఈ ఆఫ‌ర్‌ను పొందాలంటే 4జీ ఫోన్ ఉండాలి. అందులో మై ఎయిర్‌టెల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అనంత‌రం హోం స్క్రీన్‌లో క‌నిపించే ఆఫ‌ర్ మెసేజ్‌ను క్లిక్ చేసి అందులో ఫ్రీ డేటాను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.

2216

More News

VIRAL NEWS

Featured Articles