ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌కు 60 జీబీ ఉచిత డేటా


Sun,September 17, 2017 11:50 AM

ఎయిర్‌టెల్ త‌న పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు 60 జీబీ ఉచిత డేటాను అందిస్తున్న‌ది. 6 నెల‌ల కాలానికి గాను నెల‌కు 10 జీబీ డేటా చొప్పున ఈ ఉచిత డేటా ల‌భిస్తుంది. అయితే ఇందుకు గాను వినియోగ‌దారులు ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్ల‌లో మై ఎయిర్ టెల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఫోన్ నంబ‌ర్‌ను ఓటీపీతో క‌న్‌ఫాం చేయాలి. అనంత‌రం హోమ్ పేజీలో పై భాగంలో ఉండే Enjoy Live Shows With FREE DATA అనే బ్యాన‌ర్‌ను క్లిక్ చేయాలి. అనంతరం ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతో ఉచిత డేటా ఆఫ‌ర్ అన్‌లాక్ అవుతుంది. ఆఫ‌ర్ అన్‌లాక్ కాగానే వినియోగ‌దారుడి ఖాతాలోకి 10జీబీ డేటా వ‌స్తుంది. అనంత‌రం మ‌రో 5 నెల‌ల పాటు నెల‌కు 10 జీబీ డేటా చొప్పున మొత్తం క‌లిపి 60 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. గ‌తంలో ఎయిర్‌టెల్ త‌న పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌, మాన్‌సూన్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అయితే వాటి ద్వారా 3 నెల‌లకు 30 జీబీ డేటా (నెల‌కు 10 జీబీ చొప్పున‌) అందించింది. కాగా ఇప్పుడు కాల ప‌రిమితిని 3 నుంచి 6 నెల‌ల‌కు పెంచి డేటాను అందిస్తున్న‌ది. అయితే ఈ ఆఫ‌ర్ ను పొందాలంటే వినియోగ‌దారుల‌కు క‌చ్చితంగా 4జీ హ్యాండ్ సెట్ ఉండాలి. 3జీ హ్యాండ్ సెట్‌తో అయితే కేవ‌లం 2 జీబీ డేటా మాత్ర‌మే క్లెయిమ్ అవుతుంది.

5641

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles