వ‌చ్చేశాయ్‌.. మ‌రో రెండు ఎయిర్‌టెల్ 4జీ ఫోన్లు..!


Thu,November 16, 2017 06:44 PM

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ గ‌తంలో కార్బ‌న్ మొబైల్స్ తో క‌లిసి ఎ40 ఇండియన్ పేరిట రూ.1399 కే బ‌డ్జెట్ 4జీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. త‌రువాత ఇప్పుడు మ‌ళ్లీ అదే సంస్థ‌తో క‌లిసి ఎయిర్‌టెల్ రెండు కొత్త బ‌డ్జెట్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ల‌ను ఇవాళ విడుద‌ల చేసింది. కార్బ‌న్ ఎ1 ఇండియ‌న్‌, ఎ41 ప‌వ‌ర్ పేరిట ఈ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. ఈ రెండు ఫోన్లు వ‌రుస‌గా రూ.1799, రూ.1849 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి. అయితే వీటికి గాను యూజ‌ర్లు ముందుగా రూ.3299, రూ.3349 డౌన్‌పేమెంట్ చెల్లించాలి. అనంత‌రం 36 నెల‌ల పాటు ఈ ఫోన్ల‌ను వాడాలి. ఆ సంద‌ర్భంలో నెల‌కు క‌నీసం రూ.169 ఆపైన విలువ చేసే ప్లాన్‌ను వాడాలి. ఇలా వాడాక 18 నెల‌ల అనంత‌రం రూ.500 వెనక్కి ఇచ్చేస్తారు. ఆ త‌రువాత 36 నెల‌ల‌ పాటు ఫోన్లు వాడితే మ‌రో రూ.1000 వెన‌క్కి ఇస్తారు. దీంతో మొత్తం క‌లిపి రూ.1500 వినియోగ‌దారుల‌కు వెన‌క్కి వ‌స్తాయి. దీంతో ఈ ఫోన్ల ధ‌రలు రూ.1799, రూ.1849 అవుతాయి.

కార్బ‌న్ ఎ1 ఇండియ‌న్‌, ఎ41 ప‌వ‌ర్ ఫోన్ల ఫీచ‌ర్లు...


ఈ రెండు ఫోన్ల‌లోనూ 4 ఇంచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ వీవోఎల్‌టీఈ వంటి ఫీచ‌ర్లు కామ‌న్‌గా ఉన్నాయి. అయితే ఎ1 ఇండియ‌న్ ఫోన్‌లో 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్, 1500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 3.2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఫీచ‌ర్లు ఉండ‌గా, అదే ఎ41 ప‌వ‌ర్‌లో అయితే 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఫీచ‌ర్లు ఉన్నాయి.

7297

More News

VIRAL NEWS