రూ.597 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్


Tue,July 31, 2018 09:46 AM

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రూ.597 కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. వాయిస్ కాల్స్ ఎక్కువగా చేసుకునే వారిని ఉద్దేశించి ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో డేటా 10 జీబీ వరకు లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 168 రోజులుగా నిర్ణయించారు. మొబైల్ డేటా త‌క్కువ‌గా వాడుకుంటూ వాయిస్ కాల్స్ ఎక్కువ‌గా చేసుకునే వారి కోసం ఈ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని ఎయిర్‌టెల్ తెలిపింది. కాగా జియోలో రూ.509 ప్లాన్‌లో రోజుకు 4జీబీ డేటా చొప్పున 28 రోజుల వాలిడిటీకి గాను 112 జీబీ డేటా ల‌భిస్తున్న‌ది.

2446

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles