రూ.558 కి కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్


Mon,June 11, 2018 02:53 PM

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.558 కి ఓ నూతన ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఇందులో వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 82 రోజులుగా నిర్ణయించారు. దీంతో అన్ని రోజులకు కలిపి మొత్తం 246 జీబీ డేటా వినియోగదారులకు లభిస్తుంది. జియోలో ఉన్న రూ.509 ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది. జియోలో రూ.509 ప్లాన్‌కు రోజుకు 4జీబీ డేటా వస్తుంది. కానీ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే కావడం విశేషం.

4455

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles