రూ.49కే 1జీబీ డేటా.. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్..!


Mon,December 18, 2017 04:28 PM

రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. రూ.49కే 1జీబీ 4జీ మొబైల్ డేటాను అందిస్తున్నది. ఈ ప్యాక్ వాలిడిటీని 1 రోజుగా నిర్ణయించారు. ఇక రూ.99 పేరిట మరో ప్లాన్ కూడా లభిస్తున్నది. దీంట్లో యూజర్లకు 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 5 రోజులుగా ఉంది. అయితే ఈ రెండు ప్లాన్‌లను వినియోగదారులు మై ఎయిర్‌టెల్ యాప్‌లో ఆఫర్స్ అనే విభాగంలో ఎంచుకుని వాటిని రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జియోలో రూ.52కే 1.05 జీబీ డేటా లభిస్తుండగా, ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజులుగా ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్తగా రూ.49 ప్లాన్‌ను లాంచ్ చేసింది.

13846

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles