రూ.419 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్


Sun,September 16, 2018 03:37 PM

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రూ.419 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ను కస్టమర్లు రీచార్జి చేసుకుంటే వారికి రోజుకు 1.4 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 75 రోజులుగా నిర్ణయించారు. ఇక రూ.97 కి మరో నూతన రీచార్జి ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లో కస్టమర్లకు 350 నిమిషాల లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. దీంతోపాటు 200 ఎస్‌ఎంఎస్‌లు, 1.5 జీబీ డేటా వస్తాయి.

3671

More News

VIRAL NEWS

Featured Articles