ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. రూ.198కే రోజూ 1 జీబీ డేటా..!


Sat,November 25, 2017 02:14 PM

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఈ మధ్య కాలంలో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అనేక కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నది. నిన్ననే రూ.799, రూ.549 ప్లాన్లను ప్రవేశపెట్టగా, ఇప్పుడు రూ.198కు మరో ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ప్లాన్ పట్ల ఎయిర్‌టెల్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఇప్పటికే చాలా మంది ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ మై యాప్ ద్వారా ఈ ప్లాన్ లభిస్తున్నది. రూ.198 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వినియోగదారులకు రోజుకు 1జీబీ 3జీ/4జీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అయితే వాయిస్ కాల్స్‌కు పరిమితి రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు ఉంటుంది. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

3715

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles