జియోకు పోటీగా రూ.129కే ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..!


Mon,April 30, 2018 03:17 PM

ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. రూ.129కే ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. దీంతో రీచార్జి చేసుకుంటే వినియోగదారులకు 1జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, ఉచిత హలో ట్యూన్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. జియోలో ఇదే తరహా ప్లాన్ రూ.98కి అందుబాటులో ఉంది. దాంట్లో కస్టమర్లకు 2 జీబీ డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

4671

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles