ఎయిర్‌టెల్ ఆఫర్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో ఉచిత హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్..!


Wed,November 8, 2017 03:51 PM

ఎయిర్‌టెల్ సంస్థ తన కస్టమర్లకు రూ.499 ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్‌తోపాటు నెలకు 20 జీబీ ఉచిత 4జీ డేటా లభిస్తుంది. అయితే దీంతోపాటు కస్టమర్లకు ఎయిర్‌టెల్ ఉచిత డివైస్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను అందిస్తున్నది. ఈ క్రమంలో ఈ ప్లాన్‌ను వాడే కస్టమర్లు తమ ఫోన్‌ డ్యామేజ్ అయినా, మాల్‌వేర్ దాడి వల్ల పాడైపోయినా ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్‌తోపాటు వినియోగదారులకు వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లలో ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

3229

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles