కొత్త రీచార్జి ప్యాక్‌లను ప్రకటించిన ఎయిర్‌టెల్


Tue,September 4, 2018 05:34 PM

టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు నూతన రీచార్జి ప్యాక్‌లను ఇవాళ ప్రకటించింది. రూ.35, రూ.65, రూ.95 కాంబో రీచార్జి ప్యాక్‌లను ఈ రోజు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. రూ.35 ప్యాక్‌తో 100 ఎంబీ డేటా, రూ.26.66 టాక్‌టైం లభిస్తాయి. ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులు. అలాగే రూ.65 ప్యాక్‌తో 200 ఎంబీ డేటా, రూ.65 టాక్ టైం లభిస్తాయి. ఈ ప్యాక్ వాలిడిటీ కూడా 28 రోజులే. ఇక చివరిగా రూ.95 ప్యాక్‌తో కస్టమర్లకు 500 ఎంబీ డేటా, రూ.95 టాక్‌టైం లభిస్తాయి. ఈ ప్యాక్ వాలిడిటీని కూడా 28 రోజులుగానే నిర్ణయించారు. కాగా ఈ ప్యాక్‌లు ప్రస్తుతం పంజాబ్, తమిళనాడు, యూపీ వెస్ట్ ప్రాంత ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, త్వరలో ఇతర ప్రాంత వినియోగదారులకు కూడా లభిస్తాయని ఎయిర్‌టెల్ వెల్లడించింది.

7382

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles