ఐఫోన్ 10 ఫేస్ ఐడీని ఫూల్ చేసేశారు..!


Mon,November 13, 2017 06:20 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తాను రీసెంట్‌గా విడుదల చేసిన ఐఫోన్ 10లో ఫేస్ ఐడీ అనే అద్భుతమైన ఫీచర్‌ను అందిస్తున్నదని అందరికీ తెలిసిందే. దీని సహాయంతో యూజర్లు తమ ఫేస్‌ను 3డీ స్కాన్ చేసుకోవచ్చు. తద్వారా వారు తమ ముఖాన్ని పాస్‌వర్డ్‌గా పెట్టుకోవచ్చు. అయితే ఇటీవలే ఓ ఐటీ సెక్యూరిటీ సంస్థ‌కు చెందిన బృందం ఈ ఫేస్ ఐడీని ఫూల్ చేసింది. అవును, మీరు విన్నది నిజమే.

సాధారణంగా అయితే ఈ ఫేస్ ఐడీ ఫీచర్‌ను హ్యాక్ చేయడం అంత ఆషామాషీ విషయం కాదు. చాలా మంది దీన్ని బైపాస్ చేసి ఐఫోన్ 10ను అన్‌లాక్ చేసేందుకు అనేక ట్రిక్స్ యత్నించారు. కొందరు జంతువుల ముఖాలతో ఫేస్ ఐడీ యత్నిస్తే, కొందరు కవల పిల్లలు ఫేస్ ఐడీ అన్‌లాక్‌ను యత్నించారు. ఇంకా కొందరు తమ ఫొటొలతో ఐఫోన్ 10ను ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలోనే అనేక టెక్ సంస్థలు యాపిల్ ఫేస్ ఐడీ ఫీచర్‌కు చాలా సేఫ్టీ ఉన్న లాక్ ఫీచర్ అని కితాబిచ్చాయి. అయితే బీకేఏవీ అనే ఓ సెక్యూరిటీ సంస్థ మాత్రం యాపిల్ ఫేస్ ఐడీని ఫూల్ చేసింది. అదెలాగంటే...

బీకేఏవీ బృందంలోని ఓ హ్యాకర్ తనలాగే ఉండే ఫేస్‌మాస్క్‌ను 3డీ ప్రింటర్ ద్వారా క్రియేట్ చేశాడు. అనంతరం దానిపై ఆర్టిఫిషియల్ చర్మాన్ని అతికించాడు. ఈ క్రమంలో అతను తన ఫేస్ ద్వారా ఐఫోన్ 10లో ఫేస్ ఐడీ లాక్ క్రియేట్ చేశాడు. అనంతరం దాన్ని తాను అంతకు ముందు క్రియేట్ చేసిన 3డీ ఫేస్ మాస్క్‌తో అన్‌లాక్ చేయగా అది సక్సెస్ అయింది. దీంతో యాపిల్ ఫేస్ ఐడీ ఫీచర్ బైపాస్ అయి ఫోన్ అన్‌లాక్ అయింది..! అలా బీకేఏవీ బృందం యాపిల్ ఫేస్ ఐడీని ఫూల్ చేసింది.

అయితే 3డీ ఫేస్‌మాస్క్‌ను క్రియేట్ చేసేందుకు ఆ బృందానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా..? రూ.10వేలు. అంటే ఎవరికి చెందిన ఐఫోన్ 10లో అయినా ఫేస్ ఐడీ లాక్ ఉన్నప్పటికీ వారి ముఖాన్ని 3డీ ప్రింట్ తీసి రూ.10వేల ఖర్చుతో మాస్క్ లా క్రియేట్ చేస్తే చాలన్నమాట. దాంతో ఆ వ్యక్తి ఐఫోన్ 10ను ఇట్టే అన్‌లాక్ చేయవచ్చు. కాగా సదరు బీకేఏవీ బృందం ఈ ప్రయోగాన్ని వీడియో కూడా తీసింది. కావాలంటే దాన్ని కింద చూడవచ్చు. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన 3డీ ఫేస్ మాస్క్‌తో ఐఫోన్ 10 ఫేస్‌ఐడీని అన్‌లాక్ చేశాడు..!

2955

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles