కవలలకు జన్మనిచ్చిన 52 ఏళ్ల మహిళ..


Sat,October 12, 2019 04:53 PM

కరీంనగర్: భాద్రాచలంకు చెందిన 52 ఏళ్ల ఓ మహిళ కరీంనగర్‌లోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రంలో కవలలకు జన్మనిచ్చింది. వివరాల్లోకెళ్తే..రమాదేవి(52) అనే మహిళకు ముందు ఓ కుమారుడు జన్మించాడు. కుమారుడు చేతికొచ్చాడని తల్లిదండ్రులు సంతోషిస్తున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో అతడు మరణించాడు. దీంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయన ఆ దంపతులు.. చాలా ఏళ్ల తర్వాత సంతానం కావాలనుకున్నారు. వయసు మీద పడడంతో వారు ప్రత్యామ్నాయ మార్గం కోసం అన్వేషించారు. కరీంనగర్ పట్టణంలోని పద్మజా సంతాన సాఫల్య కేంద్రం గురించి తెలుసుకొని, వైద్యురాలు పద్మజను సంప్రదించారు. వైద్యురాలు పద్మజ ఐవీఎఫ్ విధానంలో ఆమె గర్భం దాల్చేందుకు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. నెలలు నిండిన తర్వాత రమాదేవి ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఆ దంపతులు వైద్యురాలికి కృతజ్ఞతలు తెలిపారు.

5339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles