2019 యాపిల్ ఈవెంట్.. కొత్తగా విడుదల కానున్న ప్రొడక్ట్స్ ఇవే..?


Sun,August 25, 2019 12:43 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన నూతన ప్రొడక్ట్స్ లాంచింగ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుందని వార్తలు వస్తున్న విషయం విదితమే. యాపిల్ తన ఈవెంట్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ అదే రోజున యాపిల్ ఈవెంట్ ఉండవచ్చని తెలుస్తోంది. ఇక ఆ ఈవెంట్‌లో ఈసారి విడుదల చేస్తారని భావిస్తున్న పలు నూతన ప్రొడక్ట్స్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే...

ఈ ఏడాది యాపిల్ విడుదల చేయనున్న ఐఫోన్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 11, 11 ప్రొ పేరిట రెండు మోడల్స్‌ను విడుదల చేయడంతోపాటు గతేడాది విడుదల చేసిన ఐఫోన్ Xఆర్ మోడల్‌లాగే ఈ సారి ఐఫోన్ 11ఆర్‌ను కూడా యాపిల్ విడుదల చేయవచ్చని తెలిసింది. ఇక ఈ నూతన ఐఫోన్లలో యాపిల్ ఎ13 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే నూతన ఐప్యాడ్ల విషయానికి వస్తే ఈ సారి యాపిల్ ఎ13 ప్రాసెసర్ కలిగిన 10.2 ఇంచుల ఐప్యాడ్, ఐప్యాడ్ ప్రొలను యాపిల్ విడుదల చేస్తుందని తెలిసింది. యాపిల్ ఈ ఏడాది నిర్వహించనున్న తన ఈవెంట్‌లో 16 ఇంచుల మాక్‌బుక్ ప్రొను, వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌ను, నూతన ఎయిర్‌పాడ్స్‌ను కూడా విడుదల చేస్తుందని తెలిసింది. ఇక వీటి గురించిన మరిన్ని వివరాలు లాంచింగ్ ఈవెంట్‌లోనే తెలుస్తాయి..!

803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles