2018 ఐఫోన్ మోడల్స్‌లో డ్యుయల్ సిమ్ ఫీచర్ ?


Sat,November 18, 2017 06:15 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్లలో వినియోగదారులను ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఫీచర్ డ్యుయల్ సిమ్. ఇప్పటి వరకు ఆ ఫోన్లలో కేవలం సింగిల్ సిమ్ వేసుకోవడానికి మాత్రమే వీలుండేది. అయితే 2018లో రానున్న ఐఫోన్ మోడల్స్‌లో డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను అందివ్వనున్నట్టు తెలిసింది. దీంతో ఆ ఫోన్లలో ఒకే సారి రెండు సిమ్‌లను వేసుకుని ఉపయోగించవచ్చు.

కేజీఐ సెక్యూరిటీస్ అనే సంస్థకు చెందిన విశ్లేషకుడు మింగ్ చి కువో తెలిపిన ప్రకారం 2018లో రానున్న ఐఫోన్ మోడల్స్ 5.8 ఇంచ్, 6.1 ఇంచ్, 6.5 ఇంచ్ డిస్‌ప్లే సైజ్‌లలో ఉంటాయని సమాచారం. ఇక వీటిలో 6.1 ఇంచ్ మోడల్‌లో ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేసే అవకాశం ఉండగా, 5.8 ఇంచ్, 6.5 ఇంచ్ మోడల్స్‌లో ఇప్పటి ఐఫోన్ 10 తరహాలో ఓలెడ్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేయవచ్చని తెలిసింది. ఇక ఈ ఫోన్లలో రెండు సిమ్‌లు వేసుకునే విధంగా డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను అందివ్వవచ్చని సమాచారం. వాటిల్లో డ్యుయల్ 4జీ, డ్యుయల్ స్టాండ్ బై ఉండే విధంగా డ్యుయల్ సిమ్ ఫీచర్‌ను ఏర్పాటు చేస్తారని మింగ్ చి కువో వెల్లడించారు.

2456

More News

VIRAL NEWS