యూకే వేరియంట్ | పంజాబ్లో 80శాతం కొవిడ్-19 కేసుల్లో యూకే వైరస్ వేరియంటేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా పరిస్థితిపై మంగళవారం ఆయన 11 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కొవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష | దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ క్రమంలో వైరస్ కట్టడికి కేంద్ర ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైరస్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సమీక్ష జరుగనుంది.