గుర్గావ్ | హర్యానాలోని గుర్గావ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుర్గావ్లోని నాధూపురలోని మురికివాడలో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు క్రమంగా పక్కనే పూరిగుడిసెలకు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఏడు వందలకుపైగా గుడిసెలు దగ్ధమయ్యాయి..