సిద్దిపేటలోని కోమటి చెరువుపై లేక్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా కోమటి చెరువు మధ్యలో ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫౌంటైన్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. 15 నిమిషాల పాటు చెరువు మధ్యలో మ్యూజిక్ వచ్చే విధంగా ఈ ఫౌంటైన్‌ను ఏర్పాటు చేశారు.
సమ్మర్లో ఈ ఎండలను, ఉక్కపోతను తట్టుకోవాలంటే మామూలు ఫ్యాన్ గాలి సరిపోదు.. కూలర్ కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే జనాలు కూలర్లు కొనడం మొదలు పెట్టేశారు.
మాస్క్ | కరోనా ఉధృతిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు లేకుండా కనిపించిన వారిని ఆపి ఫైన్లు విధిస్తున్నారు. వారు మాస్క్‌లు పెట్టుకున్నాకే అక్కడి నుంచి పంపిస్తున్నారు.
డాగ్ పార్క్ | వాతావరణం చల్లబడటంతో పాటు వీకెండ్ కావడంతో హైదరాబాద్ వాసులు కాస్త రిలాక్స్ అయ్యారు. సాయంకాలం పూట దగ్గరలోని పార్కులకు వెళ్లి కాలక్షేపం చేశారు. తమ పెంపుడు శునకాలతో వచ్చిన జనాలతో హైటెక్ సిటీలోని డాగ్ పార్క్ కూడా కళకళలాడిపోయింది.
చెరువులు, చెక్ డ్యామ్‌లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. కొండ పోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి
అమ్మ ప్రేమ కు నిదర్శనమిది ! ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న తన చిన్నారి కూతుర్ని చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. మొదట తను చుట్టుకున్న స్కార్ఫ్‌తో
ఎప్పుడు రద్దీగా ఉండే ముంబై మహానగరమది! ఇవాళ ఇలా నిర్మానుష్యంగా కనిపించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వీకెండ్లో లాక్డౌన్ విధించారు. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్ ఇలా నిర్మానుష్యంగా మారింది.