బంగారం పట్టివేత| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల బంగారం బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.