శ్రీశైలం| ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు ఈనెల 14 వరకు జరుగుతాయి.
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ | కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి భేటీ నిర్వహించనుంది.
లాక్డౌన్ | రాష్ట్రంలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో మరోసారి లాక్డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజీవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కారు | జిల్లాలోని నకిరేకల్ బైపాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. దీంతో ఓ వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నకిరేకల్ దవాఖానకు తరలించారు.